![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -465 లో..... శ్రీధర్ మారిపోయాడని కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ రోజు నా కూతురు బర్త్ డే.. నువ్వు ఇంటికి వెళ్లి అందరిని తీసుకొని రా అని కార్తీక్ చెప్పగానే సరేరా అని శ్రీధర్ అంటాడు. కార్తీక్ వెళ్లేసరికి దీప ఇల్లంత బెలూన్ లతో డెకరేషన్ చేస్తుంది. అంతా రెడీ అయ్యాక జ్యోత్స్న ఫోన్ చేసి.. నువ్వు అర్జెంట్ గా ఇంటికి రావాలని ఆర్డర్ వేస్తుంది. నేను ఆల్రెడీ హాఫ్ డే లీవ్ లో ఉన్నానని కార్తీక్ చెప్తాడు.
ఇది మా తాత ఆర్డర్ అని చెప్పి జ్యోత్స్న అనగానే కార్తీక్ నేను వెళ్తున్నానని ఇంటి నుండి బయల్దేరతాడు. కార్తీక్ వెళ్లేసరికి శివన్నారాయణ వాళ్ళు రెడి అయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళదాం పద అని అంటారు. నేను డ్రైవ్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత అందరు కలిసి శౌర్య బర్త్ డే కి కార్తీక్ ఇంటికే వస్తారు. దాంతో కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాంచనని దశరథ్ పలకరిస్తే తను సైలెంట్ గా ఉంటుంది.
మరొకవైపు పారిజాతాన్ని తీసుకొని శ్రీధర్ బయల్దేరతాడు. థాంక్స్ అల్లుడు పిక్ అప్ చేసుకున్నందుకు అని పారిజాతం చెప్తుంది. దాస్ కి ఫోన్ చేసి బర్త్ డే కి రమ్మని పిలుస్తుంది. రాను అమ్మ.. బావ వస్తున్నాడు కదా అని దాస్ అంటాడు. దాస్ వాళ్ళ కుటుంబం మా ఇంట్లోనే ఉందని కాశీ యాక్సిడెంట్ చేసిన విషయం గురించి పారిజాతంతో శ్రీధర్ చెప్తాడు. ఈ విషయం వాళ్ళు ఎవరు చెప్పలేదా అని శ్రీధర్ అడుగుతాడు. ఎవరు చెప్పలేదు వాళ్ళ సంగతి చెప్తానని పారిజాతం అంటుంది. సరే పదండీ బర్త్ డే కి టైమ్ అవుతుందని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |